టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఢిల్లీ మొత్తం కాలుష్యమయంగా మారిందనీ, అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దనే హిల్ట్ పాలసీని తీసుకొచ్చినట్టు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అలాంటి పాలసీపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. బీఆర్‌ఎస్ నేతలు పదేండ్లు తెలంగాణను అమ్మేసుకున్నా బీజేపీ నాయకులు మాట్లాడలేదని గుర్తుచేశారు. హిల్ట్ పాలసీతో కాలుష్యం, భూముల ధరలు తగ్గే అవకాశముంటే దానిపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సామెతలా మాట్లాడిన దానిని బీజేపీ వక్రీకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం ఏర్పాటుపై రాద్ధాంతం చేయడం తగదన్నారు. కళాకారులు, సాహిత్యకారులకు కుల, మతాలను ఆపాదించడం తగదని, తెలంగాణ, ఆంధ్ర భౌగోళికంగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉందామని సూచించారు. రెండేండ్ల ప్రజాపాలనా ఉత్సవాల దృష్టి మళ్లించేందుకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇన్ అండ్ ఔటర్ భూములను బీఆర్‌ఎస్ అమ్మకానికి పెట్టినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని తేలిపోయిందని తెలిపారు.
ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దనే హిల్ట్ పాలసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



