- Advertisement -
సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు
నవతెలంగాణ-తాడ్వాయి
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కంకల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు పంచుతున్న బిందెలను ఎన్నికల స్పెషల్ టీం గురువారం స్వాధీనం చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకు 41 బిందెలను పంచుతుండగా పక్కా సమాచారంతో పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. ఏ గ్రామాల్లోనైనా ఎన్నికల్లో మద్యంతో పాటు డబ్బు, బంగారు ఆభరణాలు వంటివి ఓటర్లకు పంచినట్టు తెలిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
- Advertisement -



