- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేయలేదని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. అతనికి ఉద్యోగం ఇస్తామని చెప్పినట్లు జరిగిన ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. 8 రోజుల కస్టడీలో కొన్నింటికి సమాధానం చెప్పాడని, తప్పు చేసిన బాధ అతనిలో లేదని తెలిపారు. 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఆధారాలు గుర్తించామని, ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక ఐబోమ్మకు అనుబంధంగా ఉన్న మిర్రర్ సైట్లను క్లోజ్ చేసినట్లు చెప్పారు.
- Advertisement -



