నవతెలంగాణ – హైదరాబాద్: ఇండిగో విమానాల రద్దు పరంపర కొనసాగుతున్నది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలతో వరుసగా మూడో రోజూ పెద్ద సంఖ్యలో సర్వీసులు నిలిచిపోయాయి. శుక్రవారం మొత్తం 500కుపైగా విమానాలను సంస్థ రద్దు చేసింది. దీంతో ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బోర్డింగ్ ప్రక్రియ ముగిసి 12 గంటలవుతున్నా తాము వెళ్లాల్సిన విమానానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళలనకు దిగుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల నిరసనతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఇండిగో విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు సాయంత్రమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, విమానం శుక్రవారం ఉదయానికి కూడా బయలుదేరకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉన్నామని, విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆసహనం వ్యక్తం చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప భక్తుల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



