- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఓరియెంటియా సుత్సుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల సోకే ఈ వ్యాధి, నల్లిని పోలిన సూక్ష్మ కీటకాల కాటు ద్వారా వ్యాపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, తాజాగా విజయనగరం, పల్నాడు (రెండు మరణాలు), బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ఐదుగురు మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. సకాలంలో చికిత్స అందకపోవడం లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల వ్యాధి తీవ్రమై మరణాలకు దారితీస్తున్నట్లు వైద్య నిపుణులు భావిస్తున్నారు.
- Advertisement -



