నవతెలంగాణ హైదరాబాద్: ఎన్నికల్లో యుద్ధం చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని హిమాయత్‌నగర్, నారాయణగూడలో రూ.1.40కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ, రోడ్ల పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అనర్హత వేటు అంశంపై దానం స్పందిస్తూ… ‘‘రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఎన్నికలు కొత్త కాదు.. ఇప్పటికి 11 సార్లు కొట్లాడిన చరిత్ర నాది. అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. నా వాదనలు వినిపిస్తాను. రేవంత్‌రెడ్డి మరో పదేండ్లు సీఎంగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. రైజింగ్ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుంది’’ అని దానం నాగేందర్ అన్నారు.
సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం : దానం నాగేందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



