Friday, December 5, 2025
E-PAPER
Homeజాతీయంస‌ర్ స‌ర్వే..త‌మిళ‌నాడులో భారీ మొత్తంలో ఓట్లు తొల‌గింపు

స‌ర్ స‌ర్వే..త‌మిళ‌నాడులో భారీ మొత్తంలో ఓట్లు తొల‌గింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వివాదాస్పద ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తమిళనాడులో పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపునకు కారణమవుతుందా? కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీ) వెల్లడించిని సంఖ్యలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకు 84.91 లక్షల ఫారాలను సేకరించలేని కారణంగా ఈ పేర్లు డ్రాఫ్ట్ రోల్స్ లో కనిపించవని తెలుస్తుంది. సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియకు ఇంకా ఎనిమిది రోజులే ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో భారీ సంఖ్యలో ఫారాల సేకరణ ఎలా సాధ్యమని BLOలు తలలు పట్టుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 84.91 లక్షల ఫారాలు సేకరించలేనికిగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 6.41 కోట్ల ఓటర్లలో ఇది 13.24 శాతం. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… శాశ్వతంగా షిఫ్ట్ అయినవారు 44.22 లక్షలున్నారు అలాగే మరణించినట్లు నమోదైనవారి సంఖ్య 26.18 లక్షలు, ఇంట్లో లేనివారు (ఆబ్సెంట్) 10.73 లక్షల మంది, డూప్లికేట్ లేదా ఇప్పటికే నమోదైనవారి సంఖ్య 3.5 లక్షలు ఉన్నారని, ఈ జాబితాను బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్)కు ఇచ్చి పారదర్శకతను నిర్ధారిస్తామని ఎన్నికల అధికారి కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.

అయితే డిసెంబర్ 11లోగా ఫీల్డ్ ఎన్యుమరేషన్ పూర్తయిన తర్వాతే తుది జాబితా ఖరారుకానుంది. తమిళనాడులో జిల్లాల వారీగా చూస్తే.. చెన్నైలో అన్కలెక్టబుల్ ఫారాలు అత్యధికంగా 31.78 శాతం (12.73 లక్షలు) ఉన్నాయి. అంటే రాష్ట్ర రాజధాని నగరంలో దాదాపు ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరి నుంచి ఫారాల సేకరణ జరగలేదు. చెన్నై తర్వాతి స్థానంలో చెంగళపట్టు ఉంది. ໑໕ 20.7 (5.78 లక్షలు) మంది వివరాలు ఇంకా అందలేదు. ఇక అరియలూరులో అస్కలెక్టబుల్ ఫారాలు 4.3 శాతం (23వేలు)గా ఉన్నాయి.

కాగా డిసెంబర్ 16న డ్రాఫ్ట్ జాబితా తర్వాత కూడా జనవరి వరకు ఓటర్లు ఫారాలు దాఖలు చేసుకోవచ్చని సీఈఓ కార్యాలయం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -