- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -



