నవతెలంగాణ – హైదరాబాద్: మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ పేరిట మరో లేఖ విడుదల చేశారు. చికిత్స కోసం ఓ కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడ వెళ్లారని వికల్ప్ అందులో పేర్కొన్నారు. నిరాయుధుడైన హిడ్మా సహా ఆరుగురిని పోలీసులు హత్య చేశారని ఆరోపించారు. అరెస్టైన వారిలో కామ్రేడ్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి లేరన్నారు. పోలీసులతో వారిద్దరూ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టం చేశారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌కు దేవ్‌జీ కారణమని మాజీ ఎమ్మెల్యే మనీశ్ కుంజా ఆరోపించడం కుట్రే అన్నారు.
హిడ్మా హత్యకు కోసాల్ అనే వ్యక్తి ప్రధాన కారణం. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నీచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ ఇందుకు కారకులు. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా విజయవాడకు హిడ్మా వెళ్లారు. ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. హిడ్మా సహా 13 మందిని పట్టుకుని హత్య చేశారు. ఈ హత్యలను కప్పప్పుచ్చుకునేందుకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్‌కౌంటర్లని కట్టు కథలు అల్లారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ ఒట్టి బూటకం. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటాం. చనిపోయిన మావోయిస్టుల ఆశయాలను నెరవేరుస్తాం’’ అని వికల్ప్ పేరిట విడుదలైన ఆ లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది.
హిడ్మా ఎన్‌కౌంటర్‌కు దేవ్‌జీ కారణం కాదు: మావోయిస్టులు
- Advertisement -
- Advertisement -



