నవతెలంగాణ-హైదరాబాద్: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు యెస్ బ్యాంక్‌లకు సంబంధించిన మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.1,120 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఏజెన్సీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. అటాచ్ చేయబడిన ఆస్తులలో 18కి పైగా ఆస్తులు, స్థిర డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన కోట్ చేయని పెట్టుబడులలో వాటాలు ఉన్నాయి.
ఈ జాబితాలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన ఏడు ఆస్తులు, రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు చెందిన రెండు ఆస్తులు, రిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన తొమ్మిది ఆస్తులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిలయన్స్ వెంచర్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రై.లి, ఫై మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆధార్ ప్రాపరీట కన్సల్టెన్సీ ప్రై.లి, గమేసా ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌ప్రై.లి, రిలయన్స్ వెంచ్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రై.లి, ఫై మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ప్రై.లి నమోదు కాని పెట్టుబడులు, నగదు ఉందని ఆ వర్గాలు తెలిపాయి.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ మరియు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ బ్యాంక్ మోసం కేసుల్లో ఇడి గతంలో రూ.8,997 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం అటాచ్‌మెంట్ ఆస్తుల విలువ రూ.10,117 కోట్లకు చేరుకుంది.



