Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి చేశా.. మళ్లీ ఒకసారి ఆశీర్వదించండి

అభివృద్ధి చేశా.. మళ్లీ ఒకసారి ఆశీర్వదించండి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
అభివృద్ధి చేశా.. మళ్ళీ ఒక్కసారి ఆశీర్వదిస్తే ఇంకా అభివృద్ధి చేసి సూపిస్తానని పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మెండే సైదులు అన్నారు. శుక్రవారం తుంగతుర్తీలో మాట్లాడారు. యూత్ లీడర్ గా మండలానికి సేవలందించానని, తుంగతుర్తి గ్రామానికి రావలసిన నిధులను సేకరణలో భాగంగా రూ.80 లక్షల సిసి రోడ్డు, రైతు వేదిక నిర్మాణంలో భాగస్వామై అభివృద్ధి పథంలో నడిపానని తెలిపారు. పార్టీలకతీతంగా అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తూ అందరి ఆదరాభిమానాలను పొందిన నాయకుడిగా సర్పంచ్ బరిలో నిలబడి తుంగతుర్తి అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఆపదలో ఆదుకుంటూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ సమస్యలను పరిష్కారం చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి  అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -