Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇమ్మడి జయకుమార్ గెలుపు ఖాయం..

ఇమ్మడి జయకుమార్ గెలుపు ఖాయం..

- Advertisement -

నవతెలంగాణ – నూతనకల్
వామపక్షాలు, బిఆర్ఎస్, అధికార కాంగ్రెస్ బలపరిచిన ఇమ్మడి జయకుమార్ గెలుపు ఖాయమని మిత్రపక్షాల నాయకులు కుంట చంద్రారెడ్డి, చూడి మధుసూదన్ రెడ్డి కుంట మోహన్ రెడ్డి లు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని వెంకెపెళ్లిలో మిత్రపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం పేద ప్రజల పోరా పక్షాన పోరాడుతూ సహాయం చేసే స్వభావం ఉన్న వ్యక్తికి అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో “బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు తణుకునూరు సైదులు గౌడ్, మండల కమిటీ సభ్యులు బత్తుల జనార్ధన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కుంట పవన్ రెడ్డి, పాల్వాయి పరశురాములు, వెంకన్న, కార్తీక్, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -