శాసనసభ సభ్యులు నిర్ణయించిన కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి
ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి జయ కుమార్
నవతెలంగాణ – నూతనకల్
మండల పరిధిలోని వెంకేపెళ్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థులు బరిలోకి దిగారు ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకుల నిర్ణయం లేకుండా ఏకపక్ష నిర్ణయంతో నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి. గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా సై రెడ్డి సుధీర్ రెడ్డిని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇటీవల నామినేషన్ ప్రక్రియ అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను శాసనసభ సభ్యులు మందుల సామెల్ హైదరాబాదులోని తన నివాస గృహానికి పిలిపించుకొని పార్టీ కండువా కప్పి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించారు. ఆ ప్రకటనలో ఆ గ్రామానికి చెందిన సైరెడ్డి సుధీర్ రెడ్డినీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి సమక్షంలో అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అతను బిజెపి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా కర పత్రాలు విడుదల చేశారు. అతను పార్టీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం కూడా ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడు కుంట చంద్రారెడ్డి , గ్రామ శాఖ కమిటీ సభ్యుల తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తొనుకునూరి సైదులు గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇమ్మడి జయ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇతనికి వామపక్షాలు, బిఆర్ఎస్ మద్దతు తెలుపుతున్నాయి వీరి ప్రత్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఇతనికి బిజెపి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీలు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ఇరువురు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రచారంలో తిరగడంతో.అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఓటర్లు అయోమయంలో పడి ఆలోచిస్తున్నారు.


