Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామినేషన్ సెంటర్ల డేటాను పరిశీలించిన సబ్ కలెక్టర్

నామినేషన్ సెంటర్ల డేటాను పరిశీలించిన సబ్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ సెంటర్ల డేటాను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం సందర్శించి ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలోని 10 ఎన్నికల నామినేషన్ సెంటర్లను అప్రమత్తంగా ఉంచాలని, భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నామినేషన్ సెంటర్ల వల్ల ఎంతటి వ్యక్తులేవరైన గలాటా సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నామినేషన్లు సజావుగా జరిగేందుకు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  మీడియా కూడా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -