Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట  

సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట  

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మండల పరిధిలోని పెద్ద ఎక్లారా గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ లు వేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్ద ఎక్లారా గ్రామ సర్పంచ్ అభ్యర్థి మహేష్ సోమవార్, ధన్నూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జయశ్రీ దేవీదాస్,రాచూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి లోఖండే ఆకాష్, నామినేషన్లు దాఖలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆయా గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని క్యాడర్ కు సూచించారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -