Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ జీపీ సర్పంచ్ స్థానానికి బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు

మద్నూర్ జీపీ సర్పంచ్ స్థానానికి బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీకి జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలకు బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా అర్చన కృష్ణ పటేల్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్చన ఉన్నత చదువులు చదివిన వ్యక్తి అని, గ్రామ అభివృద్ధికి కృషి చేయగలదని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి ఉన్నత చదువులు చదివిన అర్చనకు గ్రామస్తులు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావడానికి కేంద్ర ప్రభుత్వం నిధులే ముఖ్యమని అన్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి అర్చనకు గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -