Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

- Advertisement -

ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ విఫలం 
మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు

గ్రామాలు పల్లెలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధి పరచండి అని మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. మండల కేంద్రంతో పటు శ్రీరామగిరి గ్రామంలో శుక్రవారం అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. మండల కేంద్రానికి చెందిన పులి రామచంద్రు గ్రామాన్ని అన్ని రంగాలు ఆదుకునేందుకు ఎంతగానో కృషి చేసన వ్యక్తి అని అన్నారు. ఆయనకు గ్రామస్తులు అండగా నిలవాలని అన్నారు. మీ గ్రామ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు నానా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని అన్నారు.

కానీ ఇచ్చిన హామీలను అమలుపరచడంలో పూర్తిగా కాంగ్రెస్ విఫలం చెందిందని తెలిపారు. మాయమాటలకు మోసపోకండి మీరు గోసపడకండి ఇప్పటికే వారు మాయమడలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. నియోజకవర్గస్థాయిగా అన్ని గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరి తెలిపారు. గతంలో కెసిఆర్ హాయంలోనే అన్ని రంగాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే కాలయాపన చేస్తుందని పేద ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు. మళ్లీ పేదల అభివృద్ధి చెందాలంటే బి ఆర్ ఎస పార్టీ గెలవాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి నాయకులు బిక్కు నాయక్ వేన్నాకుల శ్రీనివాస్ విరగని మల్లేశం గౌడ్ వారి పల్లి వెంకట్ ఆది రెడ్డి వెంకన్న రహిమాన్ తో పాటు జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -