హైకోర్టు జడ్జికే విచారణ జరిపించాలి
దోషులైన పోలీసులపై ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేయాలి..
నవతెలంగాణ – బంజారా హిల్స్
జై భీం సినిమానూ తలపించేలా కోదాడ పట్టణంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ దళిత యువకున్ని అకారణంగా కేసుల విచారణ పేరుతో పోలీసులు హత్య చేశారని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై హై కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కమిషన్ ప్రత్యేక బృందం విచారణ జరిపించాలని అన్నారు.
సంబంధిత అధికారులందరినీ తక్షణం విధులు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయని ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన థర్టీ యాక్టు అక్కడ జిల్లా ఎస్పీ తప్పు చేసిన అధికారులను కాపాడుకోవడానికి ప్రయోగించడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింహ,శివ కుమార్,వేణు తదితరులు పాల్గొన్నారు.



