రెవెన్యూ గ్రామంగా మారుస్తా
పరిదే మమతా సంతోష్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
రాఘవపురం గ్రామంలో ఉన్న రెండు చెరువులను కెనాల్ ద్వారా నీటి నింపడమే ధ్యేయంగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పరిదే మమత సంతోష్ పేర్కొన్నారు. ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా ఇంటింటా శుక్రవారం నాడు ప్రచారo నిర్వహించి నవతెలంగాణ తో మాట్లాడుతూ రాఘవపురం గ్రామం గ్రామ పంచాయతీగా ఏర్పడి ఏళ్లు గడిచాయని అయినప్పటికీ ఇప్పటికీ కొలనుపాక రెవెన్యూ గ్రామంగానే ఉండడం వల్ల గ్రామానికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి అన్నారు. సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామాన్ని పూర్తిస్థాయి రెవిన్యూ గ్రామంగా తీర్చిదిద్దడమే నా మొదటి కర్తవ్యం అన్నారు.
గ్రామంలో వీధిలైట్లు మోరీలు సిసి రోడ్లు తో పాటు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సర్పంచ్ గా కత్తెర గుర్తు అధికారులు కేటాయించారని చెప్పారు. గ్రామ ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని వేడుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన మాజీ సర్పంచ్ బక్క రాములు సీనియర్ నాయకులు మామిడాల అంజయ్య ఆరె బాలరాజు తడిక మల్లేశం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. వీరితోపాటు వార్డు మెంబర్లు ఎర్ర స్వప్న నరేష్, ఎర్ర దేవేంద్ర యాదగిరి,కందుల సత్యనారాయణ, జవాజీ ప్రదీప్,కరికే బీరయ్య, పరదే శ్రీకాంత్, మద్దెల నరేష్ తదితరులు పాల్గొన్నారు.



