Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

- Advertisement -

భాస్కర్లబాయి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి వడ్డె సంధ్యసైదిరెడ్డి
నవతెలంగాణ – కట్టంగూర్
తనను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మండలంలోని భాస్కర్లబాయి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి వడ్డె సంధ్యసైదిరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల మస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గెలిపిస్తే గ్రామంలో మౌలిక వసతులు కల్పించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చినపాక పరుశరాములు, మాజీ ఉప సర్పంచ్ కత్తుల జ్యోతిదేవేందర్, నాయకులు గాదపాక కన్నయ్య, కత్తుల కిరణ్, భిక్షంరెడ్డి, చింతపల్లి సుదీర్, ఆనంద్, ప్రవీణ్, అనీ, నాని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -