– కాన్గల్ లో సీఐటీయూ వాల్ పోస్టర్ విడుదల చేసిన హమాలి కార్మికులు
నవతెలంగాణ – తొగుట
సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని హమాలి కార్మిక సంఘం మండల నాయకులు మాదారం బాల్ రాజు అన్నారు. శుక్రవారం మండలంలోని కాన్గల్ గ్రామంలో హమాలి కార్మికులతో కలిసి సీఐటియు వాల్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ.. కార్మిక, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు డిసెంబర్ 7,8,9 తేదీలలో మెదక్ పట్టణంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా డిసెంబర్ 7న మెదక్ పట్టణంలో జరిగే కార్మిక మహా ప్రదర్శన – బహి రంగ సభకు మండలంలోని హమాలి కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
హమాలీ కార్మికులు నిరంతరం పనిచేయడంతొ ప్రభుత్వాలకు అనేక రూపాలలో ఆదాయాలు వస్తున్నాయని, కానీ హమాలీ కార్మికుల రక్షణ కొరకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమాలి కార్మికులకు ప్రమాదాలు జరిగితే ఎలాంటి రక్షణ లేకుండా పోతుందని వెంటనే అమాలి కార్మికుల వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి అమాలి కార్మికులకు రక్షణ కల్పించాలని కోరారు. అమాలి కార్మికులకు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఐకెపి, సోసైటీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులకు హమాలి డబ్బు లను పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ప్రభు త్వాలే చెల్లించాలని డిమాండ్ చేశారు. కోరారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టా లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను తెచ్చిందని విమర్శించారు. ఈ కోడ్ ల వలన కార్మికులు అనేక హక్కులను కోల్పోయి బానిసలుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. ఈ మహాసభలలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాలకు కార్యా చరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ హమాలి కార్మికులు మల్లయ్య, సతీష్, రాములు, చిరంజీవి, కనకయ్య, స్వామి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.



