నవతెలంగాణ-అడ్డగూడూర్ : అడ్డగూడూరు మండల కేంద్రంలో స్థానిక సర్పంచుల ఎన్నికలలో భాగంగా మూడో విడతలో జోరుగా సర్పంచి , వార్డ్ మెంబర్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అడ్డగూడూరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బాల్యంల భానుమంజుల సైదులు, టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పూజారి వనజ సైదులు గౌడ్, కాంగ్రెస్ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా కడారి ఉపేంద్ర రమేష్, లక్ష్మీదేవి కాలువ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వల్లంబట్ల రమాదేవి పూర్ణచందర్రావు , గోవిందాపురం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పోలిశెట్టి బాలశౌరి , చౌళ్ల రామారం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మందుల మనీషా సోమన్న , టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మందుల రేణుక కిరణ్ , లక్ష్మీదేవి కాలువ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థిగా బండి మంగతాయారు నరసింహ స్వామి, టిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా నక్క సురాంబా అబ్బయ్య, మానాఈకుంట కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కడారి శ్రీనివాస్ , టిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా దేశబోయిన నాగయ్య , గట్టుసింగారం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మార్త వరమ్మ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థిగా ఏనుగుతల ఉపేంద్ర నాగరాజు, టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పొన్నాల అనిత నవీన్ కుమార్ అదేవిధంగా పలు గ్రామాల నుండి సర్పంచ్ వార్డ్ మెంబర్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు కావడంతో పోటాపోటీగా నామినేషన్లు వేయడం జరిగింది.




