- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక కోసం ఇండిపెండెంట్ అభ్యర్థిగా సునీత హనుమాన్లు స్వామి తమ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సునీత హనుమాన్ల స్వామి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల కోసం ఇప్పటివరకు చేసిన సేవలు గుర్తించాలని సర్పంచ్ గా గెలిపించి మరిన్ని సేవలు చేసుకునే విధంగా భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నామినేషన్ దాఖల కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వట్నాలవార్ సాయన్న వట్నాల్వా రమేష్ పాల్గొన్నారు.
- Advertisement -



