Friday, December 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేసీఆర్‌ను క‌లిసిన BRS ఏక‌గ్రీవ స‌ర్పంచ్‌లు

కేసీఆర్‌ను క‌లిసిన BRS ఏక‌గ్రీవ స‌ర్పంచ్‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు శుక్రవారం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారిని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించి, గ్రామస్తుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించిన కేసీఆర్ వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్తులను గుర్తుపట్టి పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతుల అందుబాటు, పండుతున్న పంటల పరిస్థితి గురించి పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -