నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ మండలం కాల్వపల్లి తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బాదావత్ వనిత ప్రతాప్ సింగ్ నాయక్ పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గ తిప్పన విజయసింహారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెండేళ్ల కాంగ్రెస్ అవినీతి పాలనలో వారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ కూడా అమలు చేయకుండా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ క్యాబినెట్ పనిచేస్తుందని అన్నారు. వాళ్లకు బుద్ధి రావాలంటే మనం ఈ గ్రామ చాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాలలో బారాప పార్టీ గులాబీ జెండాను ఎగరవేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మట్టపల్లి సైదయ్య యాదవ్, జెట్టి లింగయ్య, భిక్షా నాయక్, తలకొప్పుల సైదులు, చెన్నబోయిన వీరయ్య, దొండ రామరాజు, భూక్య సేవా నాయక్, ప్రేమ్ నాయక్ ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



