Friday, December 5, 2025
E-PAPER
Homeజిల్లాలునసురుల్లాబాద్ సర్పంచ్ బరిలో డిగ్రీ విద్యార్థిని 

నసురుల్లాబాద్ సర్పంచ్ బరిలో డిగ్రీ విద్యార్థిని 

- Advertisement -

అభినందిస్తున్న యువత 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

సర్పంచ్ ఎన్నికల్లో అతి చిన్న వయస్కురాలు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నసురుల్లాబాద్ మండలం దుంగవత్ గీత నసురుల్లాబాద్ సర్పంచ్ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గీత కుటుంబ సభ్యులు వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. నసురుల్లాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచి స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. గ్రామాల్లో ఎస్టీ జనాభా తక్కువ ఉండడంతో ఉన్నత చదువు చదువుతున్న దుంగావత్ గీత సర్పంచి పదవికి నామినేషన్ దాఖలు చేసింది. ఉమ్మడి మండలంలోని నసురుల్లాబాద్, బీర్కూర్ రెండు మండల్లో చిన్న వయసులోనే సర్పంచ్ స్థానానికి పోటీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిన్న వయసులోనే పోటీకి ముందుకు రావడంపై అధికారులు, గ్రామ పెద్దలు ఆమె ధైర్యసాహసాలను అభినందించారు. తాను గెలిస్తే నసురుల్లాబాద్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని గీత తెలిపారు. గ్రామాభివృద్ధి పట్ల తనకున్న నిబద్ధతను తెలియజేస్తూ, సర్పంచ్‌గా గెలిస్తే తన గ్రామానికి మెరుగైన అభివృద్ధి బాటలు వేస్తానని స్పష్టం చేసింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -