నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని జడ్పిహెచ్ఎస్ కోమన్ పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయలు కవిత ఉపాధ్యాయులు ఇట్టెం గోపాల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శుక్రవారం స్వచ్ఛ పాఠశాల విభాగంలో ఉత్తమ పాఠశాల గా ప్రశంసన పత్రం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ కార్యక్రమంలో భాగంగా, జిల్లాలోని పాఠశాలల లో పొందుపరిచిన 16 అంశాలపైన ఉన్నత ప్రమాణాలు పాటించి, పాఠశాల పరిసరాలను ఆహ్లాదకరంగా, శుభ్రముగా, పరిశుభ్రముగా ఉంచడం ద్వారా జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించిన పాఠశాలలకు జిల్లా సమీకృత కార్యాలయం, నందు జిల్లా పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డి ప్రశంసాపత్రాలు , జ్ఞాపికలను అందించి సత్కరించారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల రూపుదిద్దడంలో విశేష కృషి చేసిన 8 మంది ప్రధానోపాధ్యాయులను జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి ఎం ఓ పడకంటి శ్రీనివాస రావు ,ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి ,ఏ ఎం బాలకృష్ణ రావు జిల్లా సైన్స్ అధికారి శ్రీ గంగా కిషన్ అవార్డు గ్రహీత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



