Friday, December 5, 2025
E-PAPER
Homeజాతీయంఇండిగో సంక్షోభంపై కేంద్రం ద‌ర్యాప్తుకు ఆదేశం

ఇండిగో సంక్షోభంపై కేంద్రం ద‌ర్యాప్తుకు ఆదేశం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇండిగో ఫ్లైట్ సర్వీసులు (IndiGo Flight Services) పెద్దఎత్తున రద్దవుతుండటంతో తలెత్తిన సంక్షోభంపై కేంద్రం చర్యలకు దిగింది. ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు నిర్ణయించినట్టు తెలిపింది. సంక్షోభానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

గత నాలుగైదు రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సామూహిక రద్దుతో తలెత్తిన సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో‌ సర్వీసుల్లో ఎక్కడ పొరపాటు జరిగింది, ఇందుకు బాధ్యులెవరనేది దర్యాప్తులో గుర్తించి, అవరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నలుగురు సభ్యులతో కూడిన దర్యాప్తు కమిటీని కేంద్రం పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్‌కు కలిగిన తీవ్ర అంతరాయం, ఇందుకు దారితీసిన పరిస్థితులపై కమిటీ దర్యాప్తు చేసి నివేదికను 15 రోజుల్లోగా సమర్పించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -