Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ ఆశయ సాధన కోసం బిఎస్పి అభ్యర్థులను గెలిపించండి

అంబేద్కర్ ఆశయ సాధన కోసం బిఎస్పి అభ్యర్థులను గెలిపించండి

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
అంబేద్కర్ ఆశయ సాధన కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు అన్నారు. శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని అన్నారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు చెరుకుపల్లి లక్ష్మణ్,అన్నారం గ్రామ బీఎస్పీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము జయరాజుతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన బహుజనులకు ఓటు హక్కు,ఎన్నికల్లో నిలబడే హక్కులు వచ్చాయని అన్నారు. బీఎస్పీ పార్టీలో ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బరిలో నిలిచి గెలవాలని ఆకాంక్షించారు.డబ్బు,మద్యం లాంటి ప్రలోభాలకు భయపడి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండొద్దని అన్నారు.

గెలిస్తే చరిత్ర- ఓడితే అనుభవం వస్తుందని అందుకే నిలిచి గెలవాలని బీఎస్పీ శ్రేణులను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఎస్పీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.కులం,మతం,ప్రాంతం లాంటి భేదాలు లేకుండా న్యాయం వైపు ఉండి న్యాయం కోసం బిఎస్పి పార్టీ పాటుపడుతుందని స్పష్టం చేశారు. అందుకే అన్నారం గ్రామం నుండి బీఎస్పీ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొమ్ము జయరాజ్ యొక్క బ్యాగు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు సర్పంచ్ అభ్యర్థి జయరాజు మాట్లాడుతూ.. బీఎస్పీ తోనే దళితుల అభివృద్ధి సాధ్యమని అన్నారు.గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే తనను గెలిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -