Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని  అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని  జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ మొదట, రెండో విడత నామినేషన్ల స్వీకరణ దాఖలైన నామినేషన్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ రోజుతో ముగియనుండగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియను తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ బాక్సుల అంశాల పై సమీక్షించారు. 

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. మొదటి దశ పోలింగ్ కు కావల్సిన   బ్యాలెట్ పత్రాలను సంబంధిత ఎం .పి.డి.ఓ లకు అందజేయడం జరిగిందని వివారించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు.వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిపుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, సర్వీస్ ఓటర్లు ,టి పోల్ లో ఎప్పటికపుడు నమోదు చేయడం జరుగుతుందని తదితర అంశాల పై సన్నద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం కమిషనర్ కు వివరించారు. ప్రతి మండల  ఏం.పి.డి ఓ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లను ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు గౌతమి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, ఏసీపీ రాహుల్ రెడ్డి, డిఆర్ఓ జయమ్మ,జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -