Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

- Advertisement -

డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
నవతెలంగాణ – చారకొండ

సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. చారకొండ మండల కేంద్రంలో చారకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బలరాం గౌడ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ…స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలుపే లక్ష్యంగా పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

అధికారంలో ఉన్న పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది , ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు జరుగుతాయి. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు చాలా సంతృప్తితో ఉన్నారు వారే గ్రామ అభివృద్ధికి సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి సిద్ధమై ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల మోసపూరిత మాటలు నమ్మవద్దని సూచించారు.మండలం కేంద్రంలో అభివృద్ధి పనులపై అవగాహన కలిగిన నాయకుడు సర్పంచి అభ్యర్థి బలరాం గౌడ్ ,అని అన్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి  అనంతరం నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్ , స్థానిక మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -