– ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా
– క్లస్టర్ నామినేషన్ కేంద్రాల పరిశీలన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కమ్మర్ పల్లి క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని,చౌట్ పల్లి క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు దాఖలైన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల వివరాలను రిటర్నింగ్ అధికారరులు రాజన్న, గంగాధర్ లను అడిగి తెలుసుకున్నారు. నేటితో నామినేషన్ల దాఖలు గొడుగు ముగిస్తున్నందున ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా నామినేషన్ల పరిశీలన జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. పంచాయతీ ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆయన వెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, తదితరులు ఉన్నారు.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



