Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లిల్లీపుట్ పాఠశాలలో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం

లిల్లీపుట్ పాఠశాలలో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం శుక్రవారం  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరు వివిధ రకాల వర్కింగ్ మోడల్ టిఎల్ఎం చాట్స్ తో అందర్నీ ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా ఎంఈఓ రాజ గంగారం , కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు వినయ్ రెడ్డి   లు  పాల్గొని  చిన్నారులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ  మాట్లాడుతూ లిల్లీపుట్ పాఠశాలలో స్టూడెంట్ వీడ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.

అంతేకాకుండా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థుల సబ్జెక్ట్ పై అవగాహన అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇలాంటి సబ్జెక్టు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ విద్యార్థులు దాగి ఉన్న శక్తి బయటకు వెలికి తీయవచ్చు అన్నారు. కాంగ్రెస్  నియోజకవర్గం ఇంచార్జ్  మాట్లాడుతూ.. విద్యార్థులందరూ చక్కని ప్రదర్శన చేశారని ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులు మేదోశక్తి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మోడల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని విద్యార్థులను ప్రశంసించారు అని, ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్   రామకృష్ణ  తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని వివరించారు.

దీనివలన విద్యార్థులలో సబ్జెక్టు పై పూర్తి అవగాహన వస్తుందని తెలిపారు. అంతేకాకుండా వారిలో ఉన్న ఆత్మవిశ్వాసం దృఢమవుతుందని ప్రతి ఒక్క విద్యార్థి ధారాళంగా సబ్జెక్టు గురించి మాట్లాడగలుగుతారని స్పష్టం చేశారు. తమ పాఠశాలలో ప్రతి సంవత్సర నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని  విద్యార్థులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ , ప్రిన్సిపాల్ దాసు  ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -