Friday, December 5, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రపంచ నేల దినోత్సవంపై రైతులకు అవగాహన

ప్రపంచ నేల దినోత్సవంపై రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ రైతు జిల్లా విజ్ఞాన కేంద్రం  ఆధ్వర్యంలో కలెక్టరేట్లో   నేల పరిరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రధాన శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ డి శ్రీలత అధ్యక్షత వహించి, మాట్లాడారు. “నేల అనేది కేవలం వ్యవసాయానికి ఆధారం కాదని, ఇది మన జాతి సంపద. నేల ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. రైతులు నేల పరిరక్షణకు, సారవంతానికి పచ్చిరొట్ట ఎరువులు వాడటం, సేంద్రియ పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం” అని వివరించారు.

అనంతరం, కేంద్రంలో యంగ్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్న ఆర్. రూప భూసార పరీక్ష యొక్క ఆవశ్యకతను గురించి రైతులకు తెలియజేశారు. “ఎరువుల ఖర్చును తగ్గించుకోవడానికి, పంట దిగుబడిని పెంచడానికి భూసార పరీక్ష గురించి తెలుపుతూ, మట్టి నమూనాలను శాస్త్రీయ పద్ధతిలో ఎలా సేకరించాలో రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలో రైతులు కంచి మల్లయ్య, సిద్ధారెడ్డి  లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -