- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని కార్యకర్తలకు మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచులు, వార్డు సభ్యులు ఆయనను కలిశారు. బీఆర్‌ఎస్ అధినేత వారిని సత్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. పల్లెలకు మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా అధైర్యపడకుండా ముందుకు నడవాలి’ అని చెప్పారు.
- Advertisement -



