నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మహబూబ్ నగర్ లో ఈ నెల 5 నుండి 7 వరకు జరుగుతున్న 51 వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీలలో హుస్నాబాద్ యువకులు గడిపే సిద్ధూ, నన్నే సాయి ప్రణయ్, గుళ్ళ రణిల్ , గుళ్ళ అభిలాష్ పాల్గొంటున్నట్లు కోచ్ మడక కృష్ణ తెలిపారు. హుస్నాబాద్ యువకుల ప్రతిభను గుర్తించి సిద్దిపేట జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
క్రీడాకారులకు అభినందన
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక పట్ల రాష్ట్ర రవాణా మరియు బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తి ,జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శివ కుమార్ , వై ఎస్ ఓ జంగపల్లి బివెంకట నర్సయ్య కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ గుప్త , అంతర్జాతీయ క్రీడాకారుడు గంగాదరీ మల్లేష్ క్రీడాకారులను అభినందించారు.



