Friday, December 5, 2025
E-PAPER
Homeజిల్లాలుచివరిరోజు భారీగా నామినేషన్లు.!

చివరిరోజు భారీగా నామినేషన్లు.!

- Advertisement -

క్లస్టర్లు పరిశీలించిన ఎంపిడిఓ క్రాంతికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు

స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్లకు ప్రక్రియ చివరి మూడవరోజు రాత్రి వరకూ కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మహూర్తం బాగుందని భావించిన పోటీదారులు సాయం త్రం 4గంటల తర్వాత క్లస్టర్స్ ఆఫీసులకు క్యూ కట్టారు. వీరిని అధికారులు, లైన్లో కూర్చోబెట్టి రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. దీంతో ఎన్నికల అధికారులు సైతం ఇబ్బంది పడ్డారు. మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డులకు భారీగా నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీఓ క్రాoతికుమార్ తెలిపారు.

మండలంలోని తాడిచెర్ల, కొయ్యుర్,పెద్దతూo డ్ల,ఆన్ సాన్ పల్లి, వా ళ్లెంకుంట క్లస్టర్లను ఎంపిడిఓ పరిశీలించారు. మూడు రోజులు కలిపి మొత్తం సర్పంచ్లకు 115, వార్డులకు 339 నామినేషన్లు దాఖలు అయినట్లు తెలిపారు. నామినేషన్ వేసిన వారిలో తాడిచెర్ల 1వ వార్డు బొబ్బిలి రాజు,4వ వార్డు ఇందారపు సారయ్య,6వ వార్డు సుంకరి రాణి, మల్లారం సర్పంచ్ అభ్యర్థిగా మేకల రాజయ్య, 3వ వార్డు లింగన్నపేట రమాదేవి-శ్రీదర్, 5వ వార్డు విజయగిరి రేణుక-రాజు, కొయ్యుర్  సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల లలిత, ఎడ్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వాలా యాదగిరి రావు, నాచారం సర్పంచ్ అభ్యర్థిగా కాశివేని ఓదెలు మమత తోపాటు పలువురు నామినేషన్ వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -