Saturday, December 6, 2025
E-PAPER
Homeమానవిముఖం డల్‌గా మారితే..

ముఖం డల్‌గా మారితే..

- Advertisement -

చర్మానికి కొన్ని జాగ్రత్తలను క్రమం తప్పకుండా తీసుకుంటేనే అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం. కానీ, చర్మాన్ని కాపాడుకునేందుకు తగిన సమయం కూడా దొరకని పని ఒత్తిడిలో కొందరు మునిగిపోతున్నారు. అయితే వారాంతాల్లో క్రమం తప్పకుండా కొన్ని ఫేస్‌ ప్యాక్‌లను అప్లై చేయడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. స్కిన్‌ టోన్‌ మెయింటెయిన్‌ అవుతుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.

పసుపు, పెరుగు ఫేస్‌ ప్యాక్‌
ఈ ఫేస్‌ ప్యాక్‌ కోసం ఓ గిన్నెలో ఒక టీస్పూన్‌ పసుపు, రెండు టేబుల్‌ స్పూన్లు పెరుగు కలపండి. తర్వాత దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లయి చేసి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ ను వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది.

తేనె, నిమ్మకాయ ఫేస్‌ ప్యాక్‌
ఈ ఫేస్‌ ప్యాక్‌ కోసం ఒక గిన్నెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక టీస్పూన్‌ నిమ్మరసం కలపండి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న నల్లమచ్చలు, చర్మం నల్లబడటం పోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.

ఓట్‌ మీల్‌, పాలు ఫేస్‌ ప్యాక్‌
ఈ ఫేస్‌ ప్యాక్‌ కోసం, ఒక గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల వోట్‌ పౌడర్‌ తీసుకొని, అవసరమైన మొత్తంలో పాలు వేసి పేస్ట్‌ చేయండి. తర్వాత దీన్ని ముఖం, మెడ వంటి ప్రాంతాల్లో అప్లయి చేసి, కాసేపు మృదువుగా మసాజ్‌ చేయాలి. ఇప్పుడు 15-20 నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. దీనివల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి.

బొప్పాయి, తేనె ఫేస్‌ ప్యాక్‌
ఈ ఫేస్‌ ప్యాక్‌ కోసం ముందుగా కాస్త పండిన బొప్పాయిని తీసుకుని మెత్తగా చేసుకోవాలి. తర్వాత అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లయి చేసి 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ చర్మంలోని మలినాలను ఎఫెక్టివ్‌గా తొలగించి, చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది.

కలబంద, దోసకాయ ఫేస్‌ ప్యాక్‌
ఈ ఫేస్‌ ప్యాక్‌ కోసం మీరు రెండు టేబుల్‌ స్పూన్ల అలోవెరా జెల్‌, పావు కప్పు దోసకాయను తీసుకొని మిక్సర్‌ జార్‌లో రుబ్బుకోవాలి. తర్వాత దీన్ని ముఖం, మెడ భాగం లో అప్లై చేసి 20-30 నిమిషాల పాటు ఉంచుకొని తర్వా త చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవడం వల్ల చర్మం తాజాగా, కాంతివంతంగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -