Saturday, December 6, 2025
E-PAPER
Homeసినిమాఅందర్నీ మెప్పించే 'సైక్‌ సిద్ధార్థ'

అందర్నీ మెప్పించే ‘సైక్‌ సిద్ధార్థ’

- Advertisement -

హీరో శ్రీ నందు నటించిన చిత్రం ‘సైక్‌ సిద్ధార్థ’. వరుణ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్‌ మీడియా, నందునెస్‌ కీప్‌ రోలింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్‌ సుందర్‌ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. యామిని భాస్కర్‌ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్‌, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఈ నెల12న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ సినిమా నుంచి ‘ధుమ్‌ ఠకుమ్‌’ సాంగ్‌ లాంచ్‌ చేశారు. ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత సురేష్‌ బాబు మాట్లాడుతూ,’స్పిరిట్‌ మీడియాలో తేజ అనే ఆయన మాతో కలిసి వర్క్‌ చేస్తుంటారు. ఒక సినిమా ఉంది.. మీరు చూస్తే బావుంటుంది అని కోరారు. సరే ఇంటికి రమ్మని చెప్పాను.

వరుణ్‌తో పాటు మరికొందరు వచ్చి సినిమా చూపించారు. చాలా డిఫరెంట్‌ పర్స్పెక్టివ్‌తో తీసిన సినిమా ఇది. హై ఎనర్జీతో ఇంతకుముందు చేయని విధంగా చాలా అద్భుతంగా చేశారు. కొన్ని సీన్స్‌లో నాకు తెగ నవ్వొచ్చింది. నందు నాకు ‘పెళ్లిచూపులు’ అప్పటినుంచి తెలుసు. ఏవీఎం వారి బ్యానర్‌ కింద ఎఫర్ట్స్‌ నెవర్‌ ఫెయిల్‌ అని రాస్తారు. శరవన్‌ నిన్న చనిపోయారు. ఆయనకి నా సంతాపం తెలియజేస్తున్నాను. నందు వరుణ్‌ వీళ్ళందర్నీ చూస్తున్నప్పుడు నిజంగా వాళ్ళు ఈ సినిమా కోసం ఎఫర్ట్‌ పెట్టారనిపించింది. చాలా ప్యాషన్‌తో చేశారు. చాలా రిస్క్‌ కూడా తీసుకున్నారు. రాఘవేంద్రరావుతో పాటు చాలా మందికి ఈ సినిమా చూపించాము. అందరు కూడా చాలా అప్రిషియేట్‌ చేశారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -