చివరి విడతలో భారీగా దాఖలు
అర్ధరాత్రి వరకు కొనసాగిన పర్వం
4 నాటికి సర్పంచ్‌కు 9,870 మంది, వార్డులకు 28,042 మంది నామినేషన్
రెండో విడతలో సర్పంచ్‌కు 21,035 మంది, వార్డులకు 88,951 మంది దాఖలు
రెండో దశలో నామినేషన్ల ఉపసంహరణకు నేడు తుదిగడువు
చివరి విడతలో భారీగా దాఖలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో చివరి విడత లో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తున్నది. నామినేషన్ల దాఖలు శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి వివరాలు అందలేదు. విశ్వసనీయ సమాచారం సర్పంచ్ స్థానానికి పది వేలకుపైగా, వార్డు స్థానాలకు 50 వేలకుపైగా నామినేషన్లు దాఖ లైనట్టు తెలిసింది. మూడో విడత లో రాష్ట్రవ్యాప్తంగా 4,158 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం వరకు సర్పంచ్ స్థానానికి 9,870 మంది అభ్యర్థులు నామి నేషన్లను దాఖలు చేశారు. మూడో విడతలో 36,442 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం వరకు 28,042 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పంచాయతీ ఎన్నికల్లో రెండో విడతలో 4332 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 4328 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానానికి 21,035 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.
రెండో విడతలో 38,342 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగు తున్నాయి. అయితే 88 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 38,253 వార్డు స్థానాలకు 88,951 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. రెండో విడతలో నామినేషన్ల ఉపసంహరణ కు శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువున్నది. అదేరోజు సాయంత్రం రెండో విడతలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. మూడో విడతకు సంబంధించి శనివారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఈనెల తొమ్మిదో తేదీన ఉపసంహరణకు అవకాశ మున్నది. అదేరోజు బరిలో ఉన్న అభ్యర్థుల వివరా లను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. రాష్ట్రంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి. 189 మండలాల్లోని 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డు స్థానాలకు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది. మొదటి విడతలో 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 3,836 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు 13,127 మంది బరిలో ఉన్నారు. 37,440 వార్డు స్థానాలుంటే 149కి నామినేషన్లు దాఖలు కాలేదు. 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 27,960 వార్డుల్లో 67,893 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



