- Advertisement -
ముఖ్యమంత్రిని కలిసిన సైనిక్ వెల్ఫేర్ ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సైనిక్ వెల్ఫేర్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బోల్డ్ అండ్ బ్రేవ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కర్నల్ రమేష్ కుమార్, కెప్టెన్ శ్రీనేష్ కుమార్, కెప్టెన్ నరోత్తమ్ రెడ్డి, కెప్టెన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
- Advertisement -



