Saturday, December 6, 2025
E-PAPER
Homeజాతీయంపాన్‌ మసాలాపై కొత్త సెస్‌

పాన్‌ మసాలాపై కొత్త సెస్‌

- Advertisement -

బిల్లుకు లోక్‌సభ ఆమోదం
గరిష్టశ్లాబు 40 శాతం : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పాన్‌ మసాలా తయారీ యూనిట్లపై సెస్‌ విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. శుక్రవారం లోక్‌సభలో హెల్త్‌ సెక్యూరిటీ సే నేషనల్‌ సెక్యూరిటీ సెస్‌ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ ఈ సెస్‌ ద్వారా సమకూరిన నిధులను జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగిస్తామన్నారు. అలాగే ఆ నిధులను రాష్ట్రాలకు ఇస్తామని తెలిపారు. పాన్‌ మసాలా, ఈ తరహా ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లకు సెస్‌ విధిస్తామని అన్నారు. ప్రస్తుతం పాన్‌ మసాలాపై జీఎస్టీలో గరిష్ట శ్లాబు 40 శాతం విధిస్తున్నట్టు తెలిపారు. సెస్‌ వల్ల జీఎస్టీ రెవెన్యూపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. తయారీ సామర్థ్యం ఆధారంగా ఈ సెస్‌ విధించనున్నట్టు తెలిపారు. 2010-2014 మధ్య సెస్‌ రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 7 శాతంగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం 6.1 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. అనంతరం ఈ బిల్లును ముజూవాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -