Saturday, December 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయూరోవిజన్‌ పోటీని బహిష్కరిస్తున్నాం

యూరోవిజన్‌ పోటీని బహిష్కరిస్తున్నాం

- Advertisement -

– ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, స్లోవేనియా, స్పెయిన్‌ దేశాలు వెల్లడి
– ఇజ్రాయిల్‌ పాల్గొనడంపై అభ్యంతరం
వియన్నా :
వచ్చే ఏడాది జరగబోయే యూరోవిజన్‌ పాటల పోటీని ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, స్లోవేనియా, స్పెయిన్‌ దేశాలు బహిష్కరించాయి. ఈ పోటీలో ఇజ్రాయిల్‌ను చేర్చటంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇజ్రాయిల్‌ను పోటీ నుంచి తొలగించాలని చేసిన అభ్యర్థనలను తిరస్కరించిన యూరోపియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ యూనియన్‌ (ఈబీయూ) నిర్ణయంతో అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ మేరకు పాటల పోటీని బారుకాట్‌ చేస్తున్నట్టు ఆ నాలుగు దేశాలు ప్రకటించాయి. ఈ నాలుగు దేశాలు ఇజ్రాయిల్‌ గాజాలో జరుపుతున్న నరమేధ యుద్ధం, భారీ ప్రాణ నష్టం, మానవతా సంక్షోభం వంటి కారణాలను చూపిస్తూ పోటీకి దూరంగా ఉంటామని తెలిపాయి. కాగా ఈబీయూ నిర్ణయాన్ని ఇజ్రాయిల్‌ అధ్యక్షులు ఇసాక్‌ హెర్జోగ్‌ స్వాగతించారు. యూరోవిజన్‌ 2026 పోటీ వచ్చే ఏడాది ఆస్ట్రియాలోని వియన్నాలో జరగనున్నది. గాజాపై ఇజ్రాయిల్‌ కొనసాగిస్తోన్న యుద్ధంపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. 2023 అక్టోబర్‌ నుంచి ఇజ్రాయిల్‌ ఈ దాడులను జరుపుతోంది. అమాయకపు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలిగొంటున్నది. ఈ ఏడాది అక్టోబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. ఇజ్రాయిల్‌ దానిని విస్మరిస్తున్నది. గాజాపై కాల్పులకు తెగబడుతుంది. ఇలాంటి తరుణంలోనే యూరోవిజన్‌ పోటీ నుంచి నాలుగు దేశాలు తప్పుకోవడం చర్చకు దారి తీసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -