Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅసోం సీఎంను కలిసిన మంత్రి జూపల్లి

అసోం సీఎంను కలిసిన మంత్రి జూపల్లి

- Advertisement -

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు అసోం ముఖ్యమంత్రి హిమంతబిస్వా శర్మను కలిశారు. ‘తెలంగాణ రైజింగ్‌-2047’ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానపత్రం అందించారు. డిసెంబర్‌ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి గువహాటిలో అసోం సీఎంను కలిశారు. తెలంగాణ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని నిలిపేలా చేస్తున్న ఈ సమ్మిట్‌కు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా విజన్‌ డాక్యుమెంట్‌-2047ను ఆయనకు వివరించారు. అనంతరం మంత్రి అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రవికోట, అడిషనల్‌ సీఎస్‌ కళ్యాణ చక్రవర్తిని కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -