Saturday, December 6, 2025
E-PAPER
Homeబీజినెస్మార్కెట్లోకి రెడ్‌మీ15సి 5జి విడుదల

మార్కెట్లోకి రెడ్‌మీ15సి 5జి విడుదల

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల కంపెనీ షావోమి శుక్రవారం హైదరాబాద్‌లో తన కొత్త రెడ్‌మీ 15సి 5జి మోడల్‌ను విడుదల చేసింది. 6000 ఎంఎహెచ్‌ బ్యాటరీ కలిగిన దీని ప్రారంభ ధరను రూ.12,499గా నిర్ణయించింది. దీనికి 17.53 సెంటీమీటర్ల పెద్ద డిస్‌ప్లే, 33వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, క్వాడ్‌-కర్వ్డ్‌ స్లీక్‌ డిజైన్‌ ఉంది. ఈ బడ్జెట్‌ ఫోన్‌ డిసెంబర్‌ 11 నుండి అమ్మకానికి వస్తుందని షావోమి ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అనూజ్‌ శర్మ తెలిపారు. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, సొగసైన డిజైన్‌ కలయిక దీని ప్రత్యేకతన్నారు. 50ఎంపి కెమెరా సహా 8ఎంపి సెల్ఫీ కెమెరాతో దీన్ని అందిస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -