తాజాగా రూ.1,120 కోట్ల విలువైనవి ఈడీ సీజ్
ముంబయి : బ్యాంక్‌లను మోసం కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మెన్ అనిల్ అంబానీకి చెందిన మరిన్ని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన రూ.1,120 కోట్ల ఆస్తులను తాజాగా అటాచ్ చేసింది. ఇందులో 18 ఆస్తులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్‌హోల్డింగ్ వంటివి ఉన్నాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన 7 ఆస్తులు, రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు చెందిన రెండు ఆస్తులు, రిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రయివేటు లిమిటెడ్‌కు చెందిన 9 ఆస్తులు ఉన్నాయి. మనీలాండరింగ్‌కు సంబంధించి ఇప్పటికే రూ.8,997 కోట్ల విలువైన ఆస్తులను ఇడి అటాచ్ చేయగా.. తాజా జప్తునతో వాటి విలువ మొత్తం రూ.10,000 కోట్లకు పైగానే చేరింది. అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు బ్యాంక్‌లకు రూ.17వేల కోట్ల రుణాలకు మోసం చేసిన విషయం తెలిసిందే. రుణాలను అక్రమ బదిలీలకు ఉపయోగించి మనీలాండరింగ్‌కు పాల్పడింది. దీంతో సీబీఐ, ఈడీ ఈ కేసును విచారించడంతో అనిల్ అంబానీకి ఉచ్చు బిగుస్తోంది.
అనిల్ అంబానీ మరిన్ని ఆస్తులు జప్తు
- Advertisement -
- Advertisement -



