Saturday, December 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవాణిజ్య అసమానతలు ప్రమాదకరం

వాణిజ్య అసమానతలు ప్రమాదకరం

- Advertisement -

దీంతో భవిష్యత్‌లో ఆర్థిక సంక్షోభం
బీజింగ్‌లో జిన్‌పింగ్‌తో మెక్రాన్‌ భేటీ..పలు అంశాలపై చర్చ

బీజింగ్‌ : ”ప్రస్తుతమున్న వాణిజ్య అసమతుల్యతలు ప్రమాదకరం. ఇవి భవిష్యత్‌లో ఆర్థిక సంక్షోభాన్ని కూడా తీసుకురావచ్చు” అని మెక్రాన్‌ అన్నారు. ”రెండు దేశాలూ స్వతంత్ర జియో-పొలిటికల్‌ నిర్ణయాలు తీసుకోవాలి. చైనా, ఫ్రాన్స్‌ ప్రధాన శక్తులుగా తమ స్వంత దారిలో నడవాలి” అని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తెలిపారు. బీజింగ్‌లో ఇరు దేశాధ్యక్షులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా మెక్రాన్‌.. జిన్‌పింగ్‌కు కొన్ని అభ్యర్థనలు చేశారు. ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న అసమతుల్యతను తగ్గించడానికి సహరించాలనీ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆగేలా ఒత్తిడి తీసుకురావాలనీ, పర్యావరణం, వాణిజ్యం, జియోపాలిటక్స్‌లో సహకారం కావాలని ఆయన కోరారు.కాగా మెక్రాన్‌ అధిక సంఖ్యలో వ్యాపార ప్రతినిధులతో చైనాకు వెళ్లినా నిరాశే ఎదురైంది. పెద్ద వ్యాపార ఒప్పందాలు మాత్రం జరగలేదు. ముఖ్యంగా ఫ్రాన్స్‌ ఎదురు చూస్తున్న 500 జెట్‌ ఎయిర్‌బస్‌ ఆర్డర్‌ను కూడా చైనా ప్రకటించకపోవటం గమనార్హం.

కారణం.. అమెరికాతో వాణిజ్య చర్చలను దృష్టిలో ఉంచుకొని చైనా నుంచి ఈ ప్రకటన జరగలేదని నిపుణులు చెప్తున్నారు. అయితే రెండు దేశాల మధ్య కొన్ని చిన్న సహకార ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తున్నది.యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో ఫ్రాన్స్‌ కీలక దేశంగా ఉన్నది. కాగా ఫ్రాన్స్‌-చైనా మధ్య వాణిజ్య సమస్యలు ఉన్నాయి. చైనా ఎలక్ట్రిక్‌ వాహనాలపై యూరప్‌ కస్టమ్స్‌ పెంచింది. దీనికి ప్రతిగా ఫ్రెంచ్‌ బ్రాండీపై యాంటీ-డంపింగ్‌ విచారణను పెట్టింది. అలాగే చైనా.. ఈయూ నుంచి ఎగుమతయ్యే పోర్క్‌పై సుంకాల విషయంలో సడలింపులు ఇచ్చే అవకాశాలు కనబడటం లేవు. ఈ తరుణంలో ఇరు దేశాధ్యక్షుల మధ్య సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇక రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో చైనా సహకారాన్ని మెక్రాన్‌ కోరారు. కనీసం కాల్పుల విరమణ అయినా జరిగేలా, పలు ప్రాంతాల కీలక మౌలిక వసతులపై దాడులు ఆగేలా చైనా.. రష్యాపై ఒత్తిడి చేయాలని తెలిపారు. అయితే తాము శాంతికి కట్టుబడి ఉన్నామని జిన్‌పింగ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -