Saturday, December 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటేకాఫ్‌ అవుతుండగా అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం

టేకాఫ్‌ అవుతుండగా అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టేకాఫ్‌కి రెడీ అవుతుండగా లాటమ్‌ సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ320లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే విమాన సిబ్బంది మంటలను ఆర్పేసి ప్రయాణికులను కిందకు దింపేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. బ్రెజిల్‌ లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఏ320 విమానం 180 మంది ప్రయాణికులతో టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ప్రయాణికులను కిందకు దించేశారు. ఈ క్రమంలో విమానం నుంచి పెద్దఎత్తున మంటలు, పొగ వెలువడ్డాయి. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై లాటమ్‌ విమానయాన సంస్థ స్పందించింది. విమానంలో ఎలాంటి మంటలు చెలరేగలేదని.. లగేజీ ఎక్కించే లోడర్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపింది. సిబ్బంది అప్రమత్తమై.. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారని వెల్లడించింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -