నవతెలంగాణ-హైదరాబాద్ : సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ చొరవతో ఏర్పాటుచేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడిందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాటలోనే తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలన సాగిందని చెప్పారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా.. నూతన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యంగ నిర్మాత పేరు పెట్టి కేసీఆర్ వారికి సమున్నత గౌరవం కల్పించారని వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి ఆశయాల సాధనకు పునరంకితమవుదామన్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు కేటీఆర్ ఘన నివాళి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



