Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హౌజుబుజుర్గు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మౌల నామినేషన్

హౌజుబుజుర్గు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మౌల నామినేషన్

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలోని హౌజుబుజుర్గు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ తరఫున సయ్యద్ మౌల శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరేగింపుగా నామినేషన్ కేంద్రానికి వెళ్లి మద్దతు తెలిపారు.గ్రామ అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, రోడ్ల సౌకర్యాల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తానని మౌల తెలిపారు.

గ్రామ ప్రజల విశ్వాసం మేరకు సేవ చేయడం తన ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేస్తానని తెలిపారు. వార్డు సభ్యులుగా బోల్లెపెల్లి సునీల్, జన్ను కుమార్, బొడిగె లక్ష్మి, సయ్యద్ కరీం బి, షేక్ రజియా, షేక్ కమల్, మండ కుమారస్వామి, సయ్యద్ అక్బర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల సమన్వయ కమిటీ సభ్యులు ఏరుకొండ రవీందర్ గౌడ్, ఎంఏ గఫూర్ మార్క రజనీకర్, మాజీ సర్పంచ్ షేక్ ఇమామ్, ఏఎంసీ డైరెక్టర్ షెక్ నవీర్ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, యువకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు  పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -